Crime : వీధికుక్క దాడితో విషాదం: రేబిస్ సోకి నాలుగేళ్ల బాలుడు మృతి

Update: 2025-09-16 11:31 GMT

వీధికుక్క దాడిలో గాయపడిన నాలుగేళ్ల బాలుడు రేబిస్ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతూ మరణించాడు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరు గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తాడిశెట్టి రాజా, జ్యోతి దంపతుల కుమారుడు కార్తీక్ (4)...ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో... వీధికుక్క కార్తీక్‌పై దాడి చేసి తీవ్ర గాయాలు చేసింది. దీంతో తల్లిదండ్రులు బాలుడిని వెంటనే పొన్నూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో.. మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలుడికి రేబిస్ సోకినట్లు నిర్ధారించారు. అప్పటినుంచి చికిత్స అందించినప్పటికీ, ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ బాలుడి ఆరోగ్యం మరింత విషమించి కన్నుమూశాడు. దీంతో వెల్లలూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News