AP Tourism : ఏపీలో పర్యాటక రంగానికి కొంత హంగులు..

పర్యాటక రంగంలో మరో అద్భుతం..;

Update: 2024-11-04 04:30 GMT

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగంలో ఇది మరో అద్భుతం. ఈ నెల 9న విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ప్రయోగానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. 14 సీట్లున్న ఈ సీప్లేన్‌ను డీ హవిల్లాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ రూపొందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పున్నమిఘాట్‌లో దీనిని ప్రారంభిస్తారు. విజయవాడ-శ్రీశైలం మధ్య నడపాలని యోచిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రెగ్యులర్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.

సీ ప్లేన్ ప్రయోగం నేపథ్యంలో కృష్ణానదిలోని పున్నమిఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ జెట్టీకి అధికారులు మెరుగులు దిద్దుతున్నారు. పున్నమిఘాట్ వద్ద బయలుదేరే విమానం శ్రీశైలంలోని పాతాళగంగ బోటింగ్ పాయింట్ వద్ద ల్యాండ్ అవుతుంది. విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం, శ్రీశైల మల్లన్న ఆలయ సందర్శనకు వెళ్లే భక్తులకు సౌకర్యంగా ఉండేలా దీనిని రూపొందిస్తున్నారు. రెండో దశలో విశాఖ, నాగార్జునసాగర్, గోదావరి తదితర ప్రాంతాల్లోనూ సీ ప్లేన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

కృష్ణా నదిలో పున్నమి ఘాట్‌ వద్ద ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్‌ జెట్టీకి పర్యాటక శాఖ అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇక్కడి నుంచే సీ ప్లేన్‌ బయలుదేరి శ్రీశైలం వెళ్లనుంది. శ్రీశైలం లోని పాతాళ గంగ బోటింగ్‌ పాయింట్‌ వద్ద ఉన్న పాత జెట్టీపై దిగేందుకు అధికారులు త్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సంయుక్తంగా సీ ప్లేన్‌ ప్రయోగం చేస్తున్నాయి. బెజవాడలోని దుర్గామల్లేశ్వర ఆలయం, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం సందర్శనకు వెళ్లే భక్తులకు సౌలభ్యంగా ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News