ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ ఏర్పడింది. ఎవరు గెలుస్తారనేది బ్లాక్ బస్టర్ న్యూస్ కానుంది. పబ్లిక్ పల్స్ ఎవరికీ దొరక్కపోవడంతో.. మునుపెన్నడూ లేని రీతిలో ఉత్కంఠ కనిపిస్తోంది. ఏపీలో ఆదివారం నుంచే అంతటా 144 సెక్షన్ అమలులో ఉంది.
ముందస్తు జాగ్రత్తలలో భాగంగా పలుచోట్ల రౌడీషీటర్స్, ట్రబుల్ మంగ్ల్ యాక్టివిటీస్ కలిగిన వారికి తగు హెచ్చరికలు జారీ చేశారు పోలీస్ శాఖ అధికారులు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడానికి లేకుండా పటిష్టమైన భద్రతా బలగాలను మోహరించారు. ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్న వెంటనే తదుపరి ఆదేశాలకు ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటుచేశారు. ఆగమేఘాలపై అక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉత్తర్వులు అందచేసే విధంగా మానిటరింగ్ బృందాలతో నిరంతర నిఘా పెట్టారు.
సెక్షన్ 40, 144 అమలులో ఉన్నందున ముగ్గురికి మించి రోడ్లపై కలిసి ఉండటం నిషేధం. విజయోత్సవం చేయటంతో పాటుగా బాణాసంచా కాల్చడం కూడా నిషేధించారు. వీటిని అతిక్రమిస్తే ఎంతటి వారిపై అయిన చట్టప్రకారం చర్యలు ఉంటాయని చెబుతున్నాయి రాష్ట్ర పోలీస్ వర్గాలు. ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత పరిస్థితులను బట్టి మార్పులు సడలింపులు ఉంటాయని అన్నారు.