Pulivendula : పులివెందులలో టీడీపీ ఫ్లెక్సీలను తగలబెట్టిన దుండగులు

Update: 2025-08-08 17:30 GMT

కడప జిల్లా పులివెందులలో టీడీపీ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల సందర్భంగా పలుచోట్ల రోడ్డుకు ఇరువైపులా టీడీపీ నేతలు ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే నాలుగు రోజుల నుంచి ఈ ప్రాంతంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కొత్తపల్లి రోడ్డు పక్కన కట్టిన ఫ్లెక్సీలను దుండగులు తగలబెట్టారు. టీడీపీ నేత బీటెక్ రవి, జడ్పీటీసీ అభ్యర్థి లతారెడ్డితో పాటు జిల్లా నాయకుల పోస్టర్లతో వెలసిన ఫ్లెక్సీలను కాల్చివేశారు. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మే నెలలో జరిగిన మహానాడు సమయంలోనూ పులివెందులలో వరుసగా రెండుసార్లు టీడీపీ జెండాలు తగలబెట్టారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News