Kuppam Anna Canteen: కుప్పంలోని అన్న క్యాంటీన్‌పై మరోసారి దాడి..
Kuppam Anna Canteen: కుప్పంలో మరోసారి అన్న క్యాంటీన్‌పై దాడి జరిగింది.;
Kuppam Anna Canteen: కుప్పంలో మరోసారి అన్న క్యాంటీన్‌పై దాడి జరిగింది. రాత్రి 11 గంటల సమయంతో కొందరు దుండగులు అన్న క్యాంటీన్ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. అయితే వారు వైసీపీ కార్యకర్తలుగాఅనుమానిస్తున్నాయి టీడీపీ శ్రేణులు. మరోవైపు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన టెంట్లు, బ్యానర్లను చించేశారు చేశారు. ఇటీవల చంద్రబాబు పర్యటన సందర్భంగా అన్న క్యాంటీన్‌పై దాడి చేసి ధ్వంసం చేశారు వైసీపీ కార్యకర్తలు. తీవ్ర నిరసన తెలిపిన టీడీపీ చంద్రబాబు చేతుల మీదగా తిరిగి ప్రారంభించారు. అయితే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌పై మళ్లీ దాడి చేశారు వైసీపీ కార్యకర్తలు.
మరోవైపు అన్న క్యాంటీన్ పై వైసీపీ క్యాడర్ మళ్లీ దాడి చేయడంపై మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అన్న క్యాంటీన్ పై దాడి జగన్ రెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. జగన్ అధికారంలోకి రాగానే 201 అన్న క్యాంటీన్లను రద్దు చేశారని, పేదవాడి నోటి కాడి కూడును కూడా లాక్కుంటున్నారని మండిపడ్డారు. సర్కార్ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అన్న క్యాంటీన్లను నిర్వహించి తీరుతామని, దాడి చేసిన రౌడి మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నారా లోకేశ్.