AP : అనంతపురం లో ఊహించని వరదలు.. నీట మునిగిన ఊళ్లు

Update: 2024-10-23 09:45 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రాప్తాడు మండలం ప్రసన్నాయిపల్లి లోని కాలనీల్లో చాలా ఇళ్లల్లోకి నీరు ప్రవేశించింది. దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పరపల్లి వరకు పండమేరు వాగు ఉద్ధృతికి, వాగుకు ఇరువైపులా ఉన్న కాలనీలు నీట మునిగాయి. భవనాల ఫస్ట్ ఫ్లోర్ వరకూ వరద ముంచెత్తింది. దీంతో ఇళ్లలోని ధాన్యం బస్తాలు, వస్తువులు పాడైపోయి తీవ్రంగా నష్టపోయారు. అయితే సహాయక చర్యలు చేపట్టాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదని వరద బాధితులు ఆరోపిస్తున్నారు. రోజుల తరబడి నీళ్లలో మునిగినా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Tags:    

Similar News