Andhra Pradesh: పోలీసులకు యూటీఎఫ్ నాయకుల కౌంటర్.. గంజాయి అమ్మడానికి అనుమతి ఉందా అంటూ..
Andhra Pradesh: జగన్ సర్కార్‌పై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. సీపీఎస్ రద్దు విషయంలో ప్రభుత్వాన్ని కడిగిపడేస్తున్నారు.;
Andhra Pradesh: జగన్ సర్కార్‌పై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. సీపీఎస్ రద్దు విషయంలో ప్రభుత్వాన్ని కడిగిపడేస్తున్నారు. విజయవాడకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు యూటీఎఫ్ నాయకులు. రాష్ట్రంలో గంజాయి అమ్మడానికి అనుమతి ఉందా..? ఇసుక తరలించడానికి అనుమతులు ఉన్నాయా..? అంటూ నిలదీశారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతుంటే అనుమతులు లేవంటారా అంటూ మండిపడ్డారు. దొంగతనం చేసినవాడి ఫోటో పోలీస్ స్టేషన్‌లో ఉంటే.. 10 శాతం తమ జేబులు కత్తిరించే పాలకు ఫోటోలు ఎక్కడ పెట్టాలంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు యూటీఎఫ్ నాయకుడు.