తిరుమల లడ్డూ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో చేప కొవ్వు, ఎద్దు కొవ్వుతో ప్రసాదం చేయడం వంటని మండిపడ్డారు. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి సన్నిధిలోనే అవినీతికి పాల్పడుతారా అంటూ వీహెచ్ ప్రశ్నించారు.
తప్పు చేసింది ఎవరైనా సరే దేవుడు వారిని ఊరికే వదలడని ఆయన అన్నారు వీహెచ్. తమపై తెలుగుదేశం పార్టీ కావాలనే ఆరోపణలు చేస్తున్నారని, ప్రతిపక్షం ఆరోపించే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయ పడ్డారు. అందువల్ల తిరుమలు లడ్డూ వివాదంపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని వీహెచ్ కోరారు. దేవుడికి అన్యాయం జరిగింది కనుక వెంటనే దీని వెనక ఎవరున్నా కనిపెట్టి వారికి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు.