వైసీపీలో భగ్గుమన్న విభేదాలు.. విశాఖ నగర అధ్యక్ష పదవికి వంశీకృష్ణ రాజీనామా

తనకు మేయర్ దక్కకుండా కొందరు అడ్డుపడ్డారని, వాళ్లు దానికి ఫలితం అనుభవిస్తారని మండిపడ్డారు వంశీకృష్ణ.

Update: 2021-03-18 08:15 GMT

విశాఖ మేయర్ ఎంపికతో వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ హైకమాడ్ నిర్ణయాన్ని నిరసిస్తూ.. నగర అధ్యక్ష పదవికి వంశీకృష్ణ శ్రీనివాస్ రాజీనామా చేశారు. 21వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన వంశీకృష్ణ మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఐతే.. చివరికి ఆ అవకాశం జి.వెంకట కుమారికి దక్కడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు.

తనకు మేయర్ దక్కకుండా కొందరు అడ్డుపడ్డారని, వాళ్లు దానికి ఫలితం అనుభవిస్తారని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే కాకుండా కుట్ర చేసిన వారికి ఏమైందో అందరికీ తెలుసని, త్వరలోనే CM జగన్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తానని అన్నారు. అటు, వంశీకృష్ణ అభిమానులు GVMC ముందు ఆందోళనకు దిగడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.


Tags:    

Similar News