ఏపీ కేబినెట్‌లో 26 మందికి చోటు ఉన్నప్పటికీ చంద్రబాబు ( Chandrababu Naidu ) 25మందితో ప్రమాణం చేయించారు... ఆ ఒక్క సీటు పెండింగ్‌లో పెట్టడంపై టాక్ నడుస్తోంది. ఆ ఒక్క సీటు ఎందుకు పెండింగ్‌లో పెట్టారు... చంద్రబాబు మదిలో సుజనా చౌదరి ఉన్నారా అన్న ప్రచారం జరుగుతోంది. దానిపై ఇంకా క్లియరెన్స్ రాలేదని తెలుస్తోంది.
బీజేపీ మాత్రం పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తికే మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన ఉంది. లేకపోతే బీజేపీ ఒక పదవితోనే సరిపెట్టుకోవాలనుకుంటుందా అన్న సందేహం కలుగుతోంది. ఒకవేళ బీజేపీ మంత్రి పదవి వద్దనుకుంటే రఘురామ కృష్ణం రాదు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.