MLA Somireddy : జగన్‌కు అంత అహంకారం ఎందుకు : ఎమ్మెల్యే సోమిరెడ్డి

Update: 2025-08-17 08:00 GMT

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు జగన్‌ గైర్హాజరు కావడాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘జగన్ రెడ్డి.. ఎందుకంత అహంకారం?’’ అని ప్రశ్నిస్తూ సోమిరెడ్డి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.

లక్షల మంది ప్రాణాలర్పించి సాధించిన స్వాతంత్ర్య దినం గురించి జగన్‌కు గుర్తులేదా అని సోమిరెడ్డి నిలదీశారు. ‘‘జగన్.. మీరు ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అనే విషయం అయినా గుర్తుందా? పులివెందుల ఫలితంతో అసహనంగా ఉంటే మాత్రం జాతీయ పండుగను మరిచిపోతారా? మీ రాజకీయ జీవితంలో ఇదొక బ్లాక్ మార్క్’’ అని సోమిరెడ్డి తన పోస్ట్‌లో విమర్శించారు. మాజీ సీఎంగా ఉండి కూడా జాతీయ పండుగను విస్మరించడం సరికాదని, ఇది ఆయన అహంకారానికి నిదర్శనమని సోమిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

Tags:    

Similar News