Posani Krishna Murali : రాజకీయాలను పోసాని వదిలేస్తారా?

Update: 2024-11-22 08:45 GMT

రాజకీయాలకు సినీ దర్శకుడు, నటుడు, నిర్మాత, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి గుడ్‌బై చెబుతారని తెలుస్తోంది. పాలిటిక్స్ కు ఇక దూరంగా ఉంటానంటూ సంచలన ప్రకటన చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పోసానిపై ఏపీలో పలు చోట్ల కేసులు నమోదు కావడంతో.. ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. రేపో, మాపో అరెస్ట్ ఖాయమని టీడీపీ శ్రేణుల నుంచి విసుర్లు వస్తుండటంతో.. తాను రాజకీయాలనుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. తన కుటుంబం కోసం రాజకీయాలను వదిలేస్తున్నానని పోసాని తెలిపినట్టు తెలుస్తోంది. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే నటుడు, వైసీపీ మద్దతుదారుడు అయిన అలీ రాజకీయాలకు గుడ్ బై చెప్పడం విశేషం. ఈ కేసుల గొడవ మొదలుకాకముందే అలీ తన నిర్ణయాన్ని ప్రకటించారు.

Tags:    

Similar News