కడప జిల్లాలో కాక రేపిన పులివెందుల జడ్పీటీసీ స్థానం టీడీపీ దక్కించుకుంది. టీడీపీకి 6,700 ఓట్లకు పైగా పోలవ్వగా.. వైసీపీకి కేవలం 683 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో 5 వేల ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 35 ఏళ్ల వైఎస్ కుటుంబ పాలనకు టీడీపీ చెక్ పెట్టింది.
జగన్ అడ్డాలో మరీ ఇంత దారుణ ఓటమా..?
35 ఏళ్లుగా వైఎస్ కుటుంబ కంచుకోటగా ఉన్న పులివెందులను టీడీపీ బద్దలుకొట్టింది. అది అలా ఇలా కాదు. స్వయానా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పర్యటించినా వైసీపీకి కనీసం వెయ్యి ఓట్లు కూడా రాలేదు. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6,052 ఓట్లతో విజయం సాధించారు.. లతారెడ్డికి 6,735 ఓట్లు, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 685 ఓట్లు మాత్రమే వచ్చాయి. వైసీపీ అభ్యర్థి డిపాజిట్లు కోల్పోయాడు.