Nara Bhuvaneshwari : పులివెందులలో గెలుపంటే ఆ జోష్ వేరే.. నారా భువనేశ్వరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

Update: 2025-08-14 14:30 GMT

పులివెందుల జడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం కావడంతో అధికార పార్టీ సంబరాల్లో మునిగి తేలుతుంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత పులివెందులలో టీడీపీ జెండా ఎగురవేయడం పట్ల ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి పోయారు. ఈ స్థానం నుండి గెలుపొందిన బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి పులివెందుల విజేత మారెడ్డి లతారెడ్డికి స్వయంగా ఫోన్ చేసి అబినందనలు తెలిపారు.

పులివెందులలో గెలుపు అంటే ఆ జోష్ ఎక్కువ ఉంటుంది కదా...మీకు అభినందనలు అంటూ లతారెడ్డి కి ఫోన్ చేసి విష్ చేశారు నారా భువనేశ్వరి. ‘‘మీరు సాధించిన విజయం పట్ల మేమెంతో హ్యాపీగా ఉన్నాం’’ అని అన్నారు. అందుకు లతారెడ్డి "థాంక్యూ అమ్మా... నా విజయానికి మీరు కూడా కారణం అమ్మా.. అందరూ కలిసికట్టుగా కృషి చేశారమ్మా..." అంటూ బదులు ఇవ్వగా... "అవును, ఈ విజయం అందరిదీ... ప్రతి ఒక్కరిదీ... మనందరం ఒకే కుటుంబం" అని అభిప్రాయపడారు. "మీరు ఫోన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా... జై తెలుగుదేశం" అంటూ లతారెడ్డి బదులిచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా..టీడీపీ శ్రేణులు ఫుల్ గా షేర్ చేస్తున్నారు.

Tags:    

Similar News