ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై మహిళా చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళను చూసి కూడా బస్సు ఆపకపోవడంతో ఆగ్రహించిన మహిళ ద్విచక్ర వాహనంలో బస్సును వెంబడించి డ్రైవర్ పై బస్సులో దాడి చేసింది. ఈ సంఘటన నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయితోంది. సుచరిత అనే మహిళ ఆర్డిటి సంస్థలో విధులు నిర్వహిస్తోంది. కళ్యాణదుర్గం వెళ్లటానికి నడిమి వంక సమీపంలో బస్సు కోసం వేచి ఉంది. తనను చూసి కూడా బస్సు ఆపడం లేదని ఆగ్రహించిన మహిళ బస్సును వెంబడించి డ్రైవర్ పై చేయి చేసుకుంది. ఈ విషయం కాస్త అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరింది. అయితే ఇరువురికి సర్ది చెప్పి పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. ఓ మహిళ తనపై దాడి చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ నటేష్ బాబు.. కాగా, డ్యూటీలో ఉన్న డ్రైవర్, కండక్టర్లపై దాడి చేస్తే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది ఏపీఎస్ఆర్టీసీ.. గతంలోనూ ఇలాంటి ఘటనలపై కేసులు నమోదు చేసిన విషయం విదితమే.. ఇక, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చిన తర్వాత.. తెలంగాణ ఆర్టీసీలో పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.. అంతేకాదు, మహిళకు వాగ్వాదాలకు, దాడులకు దిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి..