Andhra Pradesh: ఏపీ ప్రజలపై మరో భారం.. భూముల ధరలు కూడా..
Andhra Pradesh: అధిక ధరలతో, ఛార్జీల వడ్డనతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజల నెత్తిన మరో పిడుగు పడబోతోంది.;
Andhra Pradesh: అధిక ధరలతో, ఛార్జీల వడ్డనతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజల నెత్తిన మరో పిడుగు పడబోతోంది.. వైసీపీ ప్రభుత్వం జనం మీద మరో భారం వేసేందుకు సిద్ధమవుతోంది.. భూముల ధరలు భారీగా పెరుగుతాయని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు.. రేపట్నుంచే పెంచిన ధరలు అమల్లోకి రావచ్చంటున్నారు.. భూముల ధరలు ఎంత శాతం పెరుగుతాయనేది మరికొన్ని గంటల్లోనే సమాచారం వస్తుందని అధికారులంటున్నారు.. అయితే, కొత్తగా ఏర్పడిన జిల్లాల ప్రాంతంలోని భూముల ధరలు మాత్రమే పెరుగుతాయని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు.