NANI: ముంబైకి కొడాలి నాని తరలింపు

మూడు రక్తనాళాల్లో బ్లాక్‌లు ఉన్నట్లు గుర్తింపు;

Update: 2025-04-01 04:00 GMT

మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిని మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు. కొద్దిరోజుల క్రితం కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురికగా.. గత ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా.. చికిత్స అందిస్తున్నారు. ముందు గ్యాస్టిక్ సమస్య అని చెప్పగా.. ఆ తర్వాత గుండెకు సంబంధించిన సమస్యతో కొడాలి నాని బాధపడుతున్నారని తేలింది. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు ఆయనను తీసుకుని ప్రత్యేక విమానంలో ముంబైకు వెళ్లారు. కొడాలి నానికి మూడు రక్తనాళాల్లో బ్లాక్‌లు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు.. బైపాస్ సర్జరీ చేయాలని సూచించినట్లు సమాచారం. అయితే కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కొంతకాలం సర్జరీ మంచిది కాదని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన్ను ముంబై తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.

 మార్చి 26 నుంచి ఆస్పత్రిలోనే..

మార్చి 26న కొడాలి నాని హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.. అయితే గ్యాస్టిక్ సమస్యతో ఆస్పత్రిలో చేరినట్లు చెప్పారు. అయితే ఆ తర్వాత గుండెపోటు అంటూ ప్రచారం జరిగింది. గుండెకు సంబంధించిన సమస్య ఉందని డాక్టర్టలు గుర్తించారని.. అప్పటి నుంచి అక్కడే చికిత్స అందించారు.ఉన్నట్టుండి ఐదు రోజుల తర్వాత హుటాహుటిన ముంబైకి తరలించారు. అయితే కొడాలి నాని ఆరోగ్యంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Tags:    

Similar News