Pattabhi Ram: టీడీపీ ఆఫీస్, పట్టాభి ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి..!
Pattabhi Ram: సీఎంకు వ్యతిరేకంగా పట్టాభి వ్యాఖ్యల్ని నిరసిస్తూ టీడీపీ కార్యాలయంపై దాడులు చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు;
Pattabhi Ram: సీఎంజగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యల్ని నిరసిస్తూ విజయవాడలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులు చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పట్టాభి ఉండటంతో అక్కడికి చేరుకుని విధ్వంసం సృష్టించారు. వైసీపీ కార్యకర్తలు. దాదాపు 50మంది వైసీపీ కార్యకర్తలు.. టీడీపీ కార్యాలయానికి చేరుకుని విధ్వంసం సృష్టించారు. అటు విజయవాడలోని పట్టాభి నివాసంపైనా దాడి చేశారు.
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దుండుగులు దాడి చేశారు. ఈనేపథ్యంలో ఇంట్లో ఫర్నిచర్‌ను దుండగులు ధ్వంసం చేశారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంపై పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు దాడిని పట్టాభి ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని అన్నారు. తప్పులను ఎత్తిచూపితే దాడులు చేస్తున్నారని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు.