గూగుల్ క్రెడిట్ కొట్టేయాలని వైసీపీ అరాచకం.. ఏంటీ దారుణం..

Update: 2025-10-16 11:30 GMT

అబద్దాలు చెప్పడానికైనా ఓ హద్దు ఉంటుంది. నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టు తయారైంది వైసీపీ ఫేక్ ప్రచారం. హద్దు, అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు వైసీపీ సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టేస్తున్నారు. ఇప్పుడు కూటమి హయాంలో విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడంతో దేశమంతా దీని గురించే మాట్లాడుకుంటోంది. ఏకంగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. దీంతో జనాల్లో సీఎం చంద్రబాబు, లోకేష్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇది చూసి తట్టుకోలేని వైసీపీ.. అసలు డేటా సెంటర్ వల్ల ఉపయోగం లేదని.. ఒక్క జాబ్ కూడా రాదని ఫేక్ ప్రచారం మొదలు పెట్టింది. అది పెద్దగా వర్కౌట్ కాలేదు.

దాంతో డేటా సెంటర్ వల్ల వాతావరణం పొల్యూట్ అవుతుందని.. హీట్ పెరుగుతుందని ఏవేవో కట్టుకథలు అల్లింది. కానీ ప్రజలు అవేవీ నమ్మట్లేదు. ఇక లాభం లేదు అనుకున్న వైసీపీ బ్యాచ్.. అసలు గూగుల్ డేటా సెంటర్ జగన్ వల్లే వచ్చిందని అడ్డగోలు ప్రచారానికి తెర తీసింది. రాష్ట్రానికి గూగుల్ తరలిరావడానికి జగనే కారణమనీ, ఇందులో సీఎం చంద్రబాబు, లోకేష్‌ చేసిందేమీ లేదన్నట్టు చెబుతోంది. కొన్నేళ్ల కిందట జగన్ సీఎంగా ఉన్నప్పుడు అదానీని కలిసిన ఫొటోలను వైరల్ చేస్తున్నారు వైసీపీ బ్యాచ్. ఆ మీటింగ్ లోనే గూగుల్ డేటా సెంటర్ కోసం ఎంవోయూ చేసుకున్నారని.. ఆ ప్రయత్నం వల్లే ఇప్పుడు విశాఖకు గూగుల్ వచ్చిందంటూ కవరింగులు ఇస్తున్నారు.

ఇది కనీసం నమ్మేలా ఉందా అంటున్నారు ఏపీ ప్రజలు. ముందేమో డేటా సెంటర్ వల్ల లాభం లేదన్నారు. తర్వాత పొల్యూషన్ అవుతుందన్నారు. ఇప్పుడేమో గూగుల్ వచ్చింది జగన్ వల్లే అంటున్నారు. ఎన్ని అబద్దాలు ఆడుతారు.. ఇంకెన్ని ఫేక్ ప్రచారాలు చేస్తారు. అసలు వైసీపీ హయాంలో ఒక్కటంటే ఒక్క ఐటీ కంపెనీ వచ్చిందా. ఏపీలో రూపాయి పెట్టుబడి కనిపించిందా.. ఆల్రెడీ ఉన్న కంపెనీలు కూడా వైసీపీకి భయపడి వెళ్లిపోయాయి. అంతటి విధ్వంసం జరిగితే ప్రజలు వద్దు బాబోయ్ అని కూటమికి జై కొట్టారు. ఇప్పుడు ఏపీకి ప్రపంచ మేటి కంపెనీలు వచ్చి లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా శభాష్ అంటున్నారు. కానీ వైసీపీకీ మాత్రం కడుపు రగిలిపోయి ఇలాంటి ఫేక్ ప్రచారానికి తెర తీస్తోంది.

Tags:    

Similar News