పిఠాపురం పర్యటన ముగించుకుని వైయస్ జగన్ హెలికాప్టర్ లో గన్నవరం చేరుకున్నారు. అనంతరం వైయస్ జగన్ విమానంలో బెంగళూరు బయల్దేరి వెళ్ళారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ప్రతి వారాంతంలో జగన్ బెంగుళూరులో విశ్రాంతి తీసుకుంటున్నారు.
వైయస్ జగన్ తిరిగి మంగళవారం తాడేపల్లి చేరుకుంటారని వైసీపీ కార్యాలయ వర్గాలు తెలియచేశాయి. పాస్ పోర్ట్ వ్యవహారం నేపథ్యంలో వైయస్ జగన్ తన లండన్ టూర్ ను వాయిదా వేసుకున్నారు. తిరిగి లండన్ ఎప్పుడు వెళ్ళేది నిర్ణయించుకోలేదని ఆ వర్గాలు తెలిపాయి.