YS Jagan: ఏపీ గవర్నర్‌తో సీఎం వైఎస్ జగన్.. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై చర్చ..
YS Jagan: రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు.;
YS Jagan: రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని నివాసం నుంచి రాజ్‌భవన్ బయల్దేరి వెళ్లిన జగన్.. ఈ సమావేశంలో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై చర్చించారు. అలాగే ఢిల్లీ టూర్ విషయాలను కూడా గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం. 40 నిమిషాల పాటు గవర్నర్‌తో భేటీ అయిన జగన్.. తిరిగి రాజ్‌భవన్ నుంచి తాడేపల్లి నివాసానికి వెళ్లారు. అటు.. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ఉంది. ఈనెల 11న ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరగనుంది.