AP : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైసీపీ చిన్న భిన్నం చేసింది : మంత్రి నారాయణ
అనకాపల్లి జిల్లా, యలమంచిలి మున్సిపాలిటీలో రాష్ట్ర పురపాలక మంత్రి నారాయణ పర్యటించారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు తాతయ్య బాబు, నియోజకవర్గ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు లతో కలిసి మంత్రి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక రామాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. నియోజవర్గంలోని ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించి అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఏడవ వార్డులో ఇంటింటా తిరిగి ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు. స్థానిక మహిళలు త్రాగునీటి డ్రైనేజీ వంటి సమస్యలతో ఇబ్బందులు పడుకుందామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు వెంటనే వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం అప్పుల ఊబిలో ఉంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిందన్నారు. అయినప్పటికీ అనుభవ సాలి అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని అధిగమిస్తూ అభివృద్ధి సంక్షేమం సమపాళ్లల్లో ముందుకు తీసుకెళుతున్నామన్నారు. యలమంచిలి మున్సిపాలిటీలో 107 కోట్ల రూపాయలతో త్రాగునీటి పథకాన్ని. రెండు కోట్ల వ్యయంతో డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. టిడిపి సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే గెలుపుతో నియోజకవర్గంలో టిడిపి వారికి సమచిత స్థానం లేదని మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశారు.