అసెంబ్లీకి రాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేల తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అసెంబ్లీని పూర్తి స్థాయిలో బహిష్కరించిన పార్టీనే లేదు. కానీ వైసీపీ మాత్రం ఇలా అసెంబ్లీని బహిష్కరించి అవమానిస్తోంది. చట్టాలు, రూల్స్ అంటే కనీస పట్టింపు లేకుండా వాళ్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై రీసెంట్ గానే అసెంబ్లీ ఎథిక్స్ కౌన్సిల్ సమావేశమై వైసీపీ మీద సీరియస్ అయింది. అసెంబ్లీకి రాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా జీతాలు తీసుకుంటారని చర్చలు జరిపారు. చట్ట సభలకు రాకుండా జీతాలు తీసుకోవడం చట్ట విరుద్ధమే అన్నారు. ఇది చట్టాలను వక్రీకరించడమే అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కంటిన్యూగా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేసే అధికారం సభాధిపతికి ఉంటుందని చట్టాలు చెబుతున్నాయి.
ఈ విషయాలపై మొన్న అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ చర్చలు జరిపి ముందు వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని అనుకుంటున్నారు. ముందు వారి వివరణ తీసుకుని ఆ తర్వాత చర్యలకు సిద్ధం కావాలని అనుకుంటున్నారంట. వైసీపీ అధినేత జగన్ తో పాటు మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా జీతాలు తీసుకుంటున్నారు. ఇది చట్టవిరుద్ధం అని అంటే.. దమ్ముంటే మా మీద అనర్హత వేయండి అంటూ సవాళ్లు విసరుతున్నారు.
ఏమైనా అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. ప్రజల సమస్యల మీద గళం వినిపించడానికి ప్రధాన ప్రతిపక్ష హోదానే అవసరం లేదు కదా. పైగా చట్ట ప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు కూడా వైసీపీకి లేవు. దాన్ని సాకుగా చూపించి చట్ట సభలను అగౌరవ పరచడం ఏంటని మండిపడుతున్నారు