YSRCP : మెడికల్ కాలేజీలపై వైసిపి కుట్రలు..

Update: 2025-12-26 06:30 GMT

ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసిపి ఆగడాలు అస్సలు ఆగట్లేదు. అధికారం పోయినా సరే వాళ్ళ రౌడీ చేష్టలు తగ్గట్లేదు. ప్రజలు పట్టించుకోవట్లేదు కాబట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఏపీలో మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పిపిపి విధానంపై రకరకాల కుట్రలకు పాల్పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా మీడియా ముందు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల్లో పెట్టుబడులు పెట్టిన వారిని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జైల్లోకి పంపిస్తామంటూ బెదిరించారు. ప్రజలకు ఉపయోగపడే ఒక విధానాన్ని ఒక రాజకీయ పార్టీ ఇలా తప్పు పట్టడం ఎప్పుడైనా చూసామా. అడ్డుపడటం కూడా ఎన్నడూ చూడలేదు. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్నా సరే రాష్ట్రానికి జరగాల్సింది మంచి పని. కూటమి ప్రభుత్వం ఇప్పుడు అలాంటి మంచి పనులు చేస్తుంటే వైసీపీ అడుగడుగునా అడ్డుపడుతోంది.

పిపిపి విధానంలో రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో నాలుగు కాలేజీలకు బిడ్లు దాఖలు చేసింది. ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కాలేజీలకు బిడ్లు వేస్తే కేవలం ఆదోని కాలేజీకి మాత్రమే కిమ్స్ ముందుకు వచ్చింది. మిగతా వాటికి ఒక్క కంపెనీ కూడా ముందుకు రాలేదు. అంటే దీని వెనకాల ఏం జరుగుతుంది. వైసిపి బెదిరింపులకు భయపడి పెట్టుబడిదారులు ముందుకు రావట్లేదా.. లేదంటే ఈ విధానంలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా అనేది ఇక్కడ ప్రధానంగా వస్తున్న ప్రశ్నలు. ఈ విధానం మీద మొదటి నుంచి వైసిపి ఎన్ని కుట్రలకు పాల్పడుతుందో మనం చూస్తూనే ఉన్నాం. నిజంగానే వైసిపి కుట్రలకు భయపడి పెట్టుబడిదారులు ముందుకు రాకపోతే దీన్ని సీరియస్ గా తీసుకోవాలి.

ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైసీపీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. 11 సీట్లకు పరిమితమైన వైసీపీ బెదిరింపులకు పెట్టుబడిదారులు భయపడుతున్నారు అంటే అది చాలా పెద్ద విషయం. ఒకవేళ ఈ విధానంలో ఏమైనా టెక్నికల్ పొరపాట్లు ఉంటే వాటిని కచ్చితంగా మార్చాల్సిందే అని ఇప్పటికే చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ విధానం మీద వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదంటున్నారు. మరి దీని మీద కూటమి ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News