YSRCP : సిఐఐ సదస్సుపై వైసిపి దుర్మార్గమైన ప్రచారం..

Update: 2025-11-19 10:57 GMT

కూటమి ప్రభుత్వంలో ఎంత పెద్ద కంపెనీలు ఏపీకి వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఇప్పటికే గూగుల్ లేటెస్ట్ సెంటర్, టిసిఎస్ లాంటి సంస్థలు వచ్చేశాయి. ఇప్పుడు సిఐఐ సబ్మిట్ తో ఇంటర్నేషనల్ కంపెనీలు చాలానే ఏపీకి రావడానికి సిద్ధపడ్డాయి. ఏకంగా 613 ఒప్పందాలు జరిగాయి. 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏడాదిన్నర లోపు అమలు అవుతాయని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు అందరి ముందు సబ్మిట్ లోనే ప్రకటించారు.

కానీ వైసీపీకి అలవాటు అయిన ఫేక్ ప్రచారం మళ్ళీ మొదలుపెట్టింది. మనం చూశాం కదా వైసిపి హయాంలో ఏపీకి ఒక్క పెట్టుబడి కూడా రాలేదు. పెట్టుబడులు రావట్లేదు ఎందుకు ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో.. ఐ ప్యాక్ లో పనిచేసే ఉద్యోగులకు సూటుబోటు వేసి ఇంటర్నేషనల్ కంపెనీల ప్రతినిధులు అంటూ స్క్రిప్ట్ రాసుకొని అమలు చేశారు. మరి దారుణం ఏంటంటే ఫ్రీగా లాప్టాప్ పంచే కార్యక్రమంలో అంతర్జాతీయ ప్రతినిధులు అన్ని చెప్పిన ఆ ఐ ప్యాక్ ఉద్యోగులు ఓ రేంజ్ లో కొట్టుకోవడం కూడా మనం చూసాం. అదంతా చూసి ఏపీ పరువు పోయింది.

అలాంటి వైసిపి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఈ స్థాయిలో ఫేక్ ప్రచారం చేస్తుంది. ఏపీకి సీఐ సమ్మిట్ వల్ల ఒక్క పెట్టుబడి కూడా రాలేదని... చంద్రబాబు నాయుడు చెబుతున్న కంపెనీలు అన్నీ డల్లా అని అర్థంపర్థం లేని ప్రచారం చేస్తోంది. స్వయంగా ఆ కంపెనీల ప్రతినిధులే వచ్చి సిఐఐ సమ్మిట్ లో పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు. వాళ్లంతా చాలా ఫేమస్ కంపెనీల ప్రతినిధులు అని ప్రపంచం మొత్తానికి తెలుసు. వాళ్లు చెప్పిన కూడా వైసిపి ఇలాంటి దిక్కుమాలిన ప్రచారం చేయడంపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ హయాంలో ఏపీకి ఎలాగూ పెట్టుబడులు రాలేదు ఇప్పుడు వస్తుంటే ఎందుకు ఇలా తప్పుడు ప్రచారం చేసి వచ్చే కంపెనీలను కూడా వెళ్ళగొట్టాలని ప్రయత్నిస్తున్నారా అంటూ మండిపడుతున్నారు.

Tags:    

Similar News