YSRCP : వైసిపి తప్పుడు ప్రచారాలు.. సీఎం చంద్రబాబు వార్నింగులు..

Update: 2026-01-20 05:05 GMT

వైసిపి అరాచకాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. ఏ చిన్న ఛాన్స్ దొరికినా సరే కూటమి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేసి బురద చల్లడానికి వైసిపి బ్యాచ్ ఎంతకైనా తెగిస్తోంది. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ వైసిపి నేతలు కూటమిని బదనాం చేయాలని చూస్తున్నారు. ఎవరి ఓపికకు అయినా ఒక హద్దు అనేది ఉంటుంది కదా. సీఎం చంద్రబాబు నాయుడు ఎంతసేపు రాష్ట్ర అభివృద్ధి మీద ఫోకస్ పెడుతూ ప్రపంచ స్థాయి కంపెనీలను ఏపీలో పెట్టుబడులు పెట్టేలా నిరంతరం కష్టపడుతున్నారు. కానీ ఇంకోవైపు వైసీపీ బ్యాచ్ రెచ్చిపోయి పెట్టుబడిదారులను బెదిరించడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కూటమి హయాంలో ఏపీ అభివృద్ధి జరిగితే తమను ఇంక ఎప్పటికీ ప్రజలు పట్టించుకోరు అని వైసిపికి అర్థమయింది. అందుకే ఏపీలో అభివృద్ధి జరగకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నారు మాజీ సీఎం జగన్ అండ్ ఆయన బ్యాచ్. సోషల్ మీడియాలో ఎన్ని రకాల తప్పుడు ప్రచారాలు చేయాలో అన్ని చేసేస్తున్నారు. మెడికల్ కాలేజీల నుంచి మార్కెట్ యార్డులు, అమరావతి మీద, రాయలసీమ ప్రాజెక్టుల మీద, విశాఖపట్నంలో పెట్టుబడుల మీద.. ఇలా ఎన్నో తప్పుడు ప్రచారాలు చేస్తుంది వైసీపీ బ్యాచ్.

కూటమి ప్రభుత్వం అభివృద్ధి కోసం ఇంత కష్టపడుతుంటే వైసీపీ బ్యాచ్ చెడగొట్టడానికి కుట్రలు చేయడం వల్ల చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యే పరిస్థితి వస్తోంది. ఎందుకంటే తాము ఇంత కష్టపడుతుంటే వైసీపీ కేవలం ఒక తప్పుడు ప్రచారం చేసి పెట్టుబడి దారులను బెదిరించడాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకుంటున్నారు. ఆయన ఓపికను వైసీపీ నేతలు పదేపదే పరిశీలిస్తున్నారు. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగులు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని.. ఇకనుంచి ఎవరినీ విడిచి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు పోలీసులకు కూడా సీరియస్ ఆదేశాలు ఇచ్చారు. తప్పుడు ప్రచారాలు చేసేది ఎవరైనా సరే వదిలిపెట్టొద్దని చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

నిజమే మరి వైసీపీ నేతల అరాచకాలు కూడా ఆ స్థాయిలోనే ఉంటున్నాయి. ఏకంగా పోలీసులనే బెదిరించే స్థాయికి వైసీపీ లీడర్లు వెళ్లిపోయారు. అధికారులు, పెట్టుబడి దారుల మీద కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాబట్టి వైసిపి అరాచక శక్తులను కచ్చితంగా అణచివేయాల్సిందే అని కూటమి ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇప్పటికే వైసీపీ గంజాయి బ్యాచ్ లాంటి వాళ్లను అరెస్టు చేసి రోడ్లమీద నడిపిస్తున్నారు. త్వరలోనే మరింతమంది వైసిపి నేతల కుట్రలను బయటపెట్టడానికి ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News