కడపజిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ సీఎం జగన్ నివాళి అర్పించారు. వైఎస్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద పూల మాల వేసి శ్రద్దాంజలి ఘటించారు.
వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు.. వైఎస్సార్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు.