టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. ప్రస్తుతం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పాదయాత్ర కొన సాగుతుంది. ఇవాళ 60వ రోజు ఉదయం 8గంటల 30నిమిషాలకు రాప్తాడు పంచాయతీ పంగల్ రోడ్డులోని క్యాంప్ సైట్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. 9.30కి అనంతపురం నియో జకవర్గంలోకి యాత్ర ఎంట్రీ అవుతుంది. 10.15కి టీవీ టవర్ వద్ద RDT సెంటర్‌ను సందర్శిస్తారు. విరామ అనంతరం సాయంత్రం 4గంటలకు విజయనగర్ కాలనీలో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం వాల్మీకి, రజకులతో భేటీ అవుతారు. 5.25కి ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశమవుతారు. 5.35కి పవర్ హౌస్ సర్కిల్ లో ముస్లింలతో ఆత్మీ య సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. 5గంటల 45నిమిషాలకు బసవన్న గుడి వద్ద ఆర్యవైశ్య సామాజిక వర్గీయులతో సమావేశమై వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటారు. 5.55కి విజయ క్లాత్ సెంటర్‌లో కురుబ సామాజికవర్గీయులతో.. 6.05కి సూర్యనగర్‌లో మద్దెర సామాజికవర్గీయులతో.. 6.25కి సప్తగిరి సర్కిల్‌లో నాయి బ్రహ్మాణు లతో, 6.25కి క్రిస్టియన్ సామాజికవర్గీయులతో మాటమంతీ నిర్వహిస్తారు. 6గంటల 35నిమిషాలకు అంబేద్కర్ విగ్రహం వద్ద.. 7.05కి గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్‌లో స్థానికు లతో సమావేశమవుతారు. 8గంటలకు రుద్రంపేట బైపాస్‌లో స్థానికులతో భేటీ అవుతారు. 8.35కి నూర్ బాషా ఫంక్షన్ హా ల్ వద్ద దూదేకులతో ఆత్మీయ సమావేశమవుతారు. 8.55కి కళ్యాణదుర్గం సర్కిల్‌లో ఎస్టీ సామాజికవర్గీయులతో భేటీ అవుతారు. 9.10కి నారాయణపురం అన్న క్యాంటీన్ వద్ద వడ్డెర సామాజికవర్గీయులతో, 9.20కి ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ వద్ద బలిజ సామాజికవర్గీయులతో సమావేశమవుతారు. రాత్రి 10గంటల 10నిమిషాలకు MYR కళ్యాణ మండపం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రి లోకేష్ అక్కడే బస చేస్తారు.