భారీ నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు..!
ఇవాళ దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో, క్యాపిటల్ గూడ్స్ కౌంటర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనవడం ఇవాళ మన మార్కెట్ల సెంటిమెంట్‌ను బలహీనపర్చింది;
ఇవాళ దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో, క్యాపిటల్ గూడ్స్ కౌంటర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనవడం ఇవాళ మన మార్కెట్ల సెంటిమెంట్‌ను బలహీనపర్చింది. దేశంలో కొవిడ్ కేసులు అమెరికా తర్వాత ఒక్కరోజులోనే భారత్‌లో భారీగా పెరగడం, మహారాష్ట్రలో మాల్స్, మల్టీప్లెక్స్‌తో పాటు ప్రైవేట్ కార్యాలయాలను మూసివేస్తున్నట్టు ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం ప్రకటించడంతో దేశీయ మార్కెట్లు కొంత ఒత్తిడికి లోనయ్యాయి.
అలాగే మాక్రో డేటా కూడా బలహీనంగా ఉండటం, యూఎస్ బాండ్ ఈల్డ్స్ ఎనిమిది నెలల గరిష్టానికి చేరడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో ఇవాళ సెన్సెక్స్ 871 పాయింట్ల నష్టంతో 49159 వద్ద, నిఫ్టీ 230 పాయింట్ల నష్టంతో 14637 వద్ద, బ్యాంక్ నిఫ్టీ 1179 పాయింట్ల నష్టంతో 32679 వద్ద ఇవాల్టి ట్రేడింగ్‌ను ముగించాయి.
ఇండియా ఒలటాలిటీ ఇండెక్స్ ఇంట్రాడేలో 14శాతం పెరిగి చివరకు 6.1శాతంతో 21.22 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈలో 1308 స్టాక్స్ నష్టపోగా, 647 స్టాక్స్ లాభాలను నమోదు చేశాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, టీసీఎస్‌లు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌గా ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 3.08శాతం, టీసీఎస్ 2.33శాతం, బ్రిటానియా 2.26శాతం, విప్రో 2.17శాతం, ఇన్ఫోసిస్ 1.78శాతం లాభంతో నిఫ్టీ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.
బజాజ్ ఫైనాన్స్ 5.87శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 5.63శాతం, ఎస్‌బీఐ 4.61శాతం, ఐషర్ మోటార్స్ 4.33శాతం, ఎంఅండ్‌ఎం 4.10శాతం నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.