Maruti Suzuki : మారుతీ సుజుకీ కొత్త మోడల్స్ పై భారీ డిస్కౌంట్

Update: 2024-06-07 09:19 GMT

మారుతీ సుజుకీ నెక్సా సిరీస్ కొన్ని మోడల్స్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇన్విక్టో మినహా అన్ని వాహనాలపై రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. కొన్ని మోడల్స్ పై 74 వేల రూపాయల వరకు రాయితీ ఇస్తోంది.

వివిధ మోడళ్లపై ఎక్స్చేంజ్ బోనస్లు, నగదు తగ్గింపు, కార్పోరేట్ ప్రయోజనాలు కూడా ఇస్తోంది. జూన్ చివరి వరకు ఈ డిస్కౌంట్లు ఉంటాయని మారుతీ సుజుకీ తెలిపింది. గ్రాండ్ విటారాపై 74వేల వరకు తగ్గింపు ప్రకటించింది. ఇందులో 20వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు, 50వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, 4వేల వరకు కార్పొరేట్ ప్రయోజ నాలు ఉన్నాయి. ఫ్రాంక్ పై 74వేల వరకు తగ్గింపు ఇస్తోంది. ఇందులో 51వేల రూపాయల డిస్కౌంట్, 10 వేలు వరకు ఎక్స్చేంజ్ బోనస్, 2 వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్, 43 వేల విలువైన యాక్సెసరీస్ కిట్ ఉంటాయి.

ఎక్స్టెల్ 6పై 80వేల రా యితీ ప్రటించింది. ఇందులో 10వేల వరకు క్యాష్ డిస్కౌంట్, 20వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ ఉంటాయి. జిమ్మీపై 50వేల వరకు రాయితీ పొందవచ్చు. సియాజ్ మోడల్పై 48 వేల రూపాయల తగ్గింపు ఇస్తోంది.

Tags:    

Similar News