Old Monk : చలికి చెక్ పెట్టే మందు బాబుల ఫేవరెట్..కేవలం 355 రూపాయలకే అదిరిపోయే కిక్కు.
Old Monk : 2025 ఏడాది వీడ్కోలు పలికింది.. కొత్త ఆశలతో 2026 అడుగుపెట్టింది. జనవరి నెల అంటేనే గజగజ వణికించే చలి.. ఈ చలిలో చిల్ అవ్వడానికి మందు బాబులు వెతుక్కునే ఫేవరెట్ బ్రాండ్ ఏదైనా ఉందంటే అది కచ్చితంగా రమ్ మాత్రమే. మార్కెట్లో ఎన్ని ఖరీదైన విదేశీ బ్రాండ్లు ఉన్నా, భారతీయ మధ్యతరగతి మందు ప్రియుల మనసు దోచుకున్న ఏకైక బ్రాండ్ ఓల్డ్ మాంక్. ఏడు దశాబ్దాలుగా తన రాజ్యాన్ని ఏలుతున్న ఈ ఐకానిక్ డార్క్ రమ్, ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లోనూ హాట్ కేకులా అమ్ముడవుతోంది.
ఓల్డ్ మాంక్ అంటే కేవలం ఒక మద్యం బ్రాండ్ మాత్రమే కాదు, అదొక ఎమోషన్. మోహన్ మీకిన్ లిమిటెడ్ సంస్థ 1954లో దీనిని ప్రారంభించింది. గడచిన 71 ఏళ్లుగా ఈ బ్రాండ్ తన క్రేజ్‌ను ఏమాత్రం కోల్పోలేదు. దీనికి ఉన్న ప్రత్యేకమైన ఫ్లేవర్, వెనీలా, కారామెల్ మిశ్రమ రుచి దీనిని మిగతా రమ్ బ్రాండ్ల కంటే భిన్నంగా ఉంచుతుంది. అందుకే కొత్త ఏడాది వేడుకల్లో, ముఖ్యంగా నార్త్ ఇండియాలోని కటిక చలిలో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఎలాంటి అడ్వర్టైజ్‌మెంట్లు లేకుండానే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న బ్రాండ్ ఇది.
మందు బాబులు ఓల్డ్ మాంక్‌ను ఎందుకు అంతగా ఇష్టపడతారంటే.. దీని తయారీ విధానమే ఒక కారణం. ఓల్డ్ మాంక్ XXX డార్క్ రమ్‌ను కనీసం ఏడేళ్ల పాటు ఓక్ చెక్కతో చేసిన బారెల్స్‌లో నిల్వ చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల దీనికి డార్క్ చాక్లెట్, వెనీలా, కారామెల్ నోట్స్ వస్తాయి. ఇక ప్రీమియం అనుభూతి కావాలనుకునే వారి కోసం ఓల్డ్ మాంక్ సుప్రీమ్ వెర్షన్ కూడా ఉంది. దీనిని ఏకంగా 18 ఏళ్ల పాటు నిల్వ ఉంచుతారు, దీనివల్ల మందు ఇంకా స్మూత్‌గా, రిచ్ టేస్ట్‌తో ఉంటుంది. ఈ రమ్‌లో ఆల్కహాల్ శాతం సాధారణంగా 42.8% వరకు ఉంటుంది.
ఓల్డ్ మాంక్ ఇంతలా సక్సెస్ అవ్వడానికి మరో ప్రధాన కారణం దాని ధర. ఎంత పెరిగినా సామాన్యుడికి అందుబాటులోనే ఉంటుంది. ఢిల్లీ మార్కెట్ ధరల ప్రకారం, దీని 180 ఎంఎల్ బాటిల్ కేవలం రూ. 355 లకే లభిస్తుంది. ఇక ఫుల్ బాటిల్ (750 ఎంఎల్) ధర వెయ్యి రూపాయల లోపే ఉంటుంది. వేర్వేరు రాష్ట్రాల్లో ట్యాక్సుల బట్టి ధరల్లో కొంత మార్పు ఉన్నప్పటికీ, ఇతర విదేశీ బ్రాండ్లతో పోలిస్తే ఇది అత్యంత సరసమైనది. అందుకే ఈ న్యూ ఇయర్ పార్టీ స్టాక్ కోసం ఇది మొదటి ప్రాధాన్యతగా నిలుస్తోంది.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం... చలికాలంలో రమ్ తాగడం వల్ల శరీరం వెచ్చగా మారుతుంది. ఇది జలుబు, దగ్గు నుంచి కొంత ఉపశమనం కలిగిస్తుందని పూర్వం నుంచి ఒక నమ్మకం ఉంది. అయితే అతిగా తాగడం ఆరోగ్యానికి హానికరం. కానీ కొత్త ఏడాది పార్టీలో స్నేహితులతో కలిసి ఓల్డ్ మాంక్ సిప్ చేస్తూ 2026కి స్వాగతం పలకడం అనేది ఒక సంప్రదాయంగా మారిపోయింది. ఆన్‌లైన్ పోర్టల్స్, వైన్ షాపుల్లో ఈ రెండు రోజులు ఓల్డ్ మాంక్ స్టాక్ నిమిషాల్లో ఖాళీ అవుతోందంటే దీని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.