Stock Market : షేర్ మార్కెట్‌లో భూకంపం.. సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్.. భారీ నష్టాల్లో నిఫ్టీ 50.
Stock Market : భారత స్టాక్ మార్కెట్‌లో ఈ వారం చివరి ట్రేడింగ్ రోజు (నవంబర్ 7, శుక్రవారం) మళ్లీ నష్టాలతో ప్రారంభమైంది. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 రెండూ భారీ క్షీణతతో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. ఉదయం 9:25 గంటల సమయానికి, సెన్సెక్స్ దాదాపు 621 పాయింట్లు పడిపోయి 82,689 వద్ద, నిఫ్టీ 50 దాదాపు 180 పాయింట్లు పడిపోయి 25,328 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు రోజు (నవంబర్ 6, గురువారం) కూడా మార్కెట్ నష్టాల్లోనే ముగియగా, శుక్రవారం మరింత భారీ నష్టాలు నమోదయ్యాయి.
భారత స్టాక్ మార్కెట్‌లో నవంబర్ 7, శుక్రవారం ట్రేడింగ్ రోజు నష్టాలతో ప్రారంభమైంది. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 160.86 పాయింట్ల (0.19%) నష్టంతో 83,150.15 వద్ద ప్రారంభమైంది. అదేవిధంగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 75.90 పాయింట్ల (0.30%) నష్టంతో 25,433.80 వద్ద రెడ్ మార్క్‌లో ట్రేడింగ్ మొదలుపెట్టింది. ఉదయం 9:25 గంటల సమయానికి, సెన్సెక్స్ మరింత పడిపోయి ఏకంగా 621 పాయింట్లు నష్టపోయి 82,689 వద్ద, నిఫ్టీ 50 180 పాయింట్లు నష్టపోయి 25,328 వద్ద ట్రేడ్ అవుతోంది.
బీఎస్ఈ బాస్కెట్‌లో కేవలం 5 షేర్లు మాత్రమే లాభాల్లో ఉండగా, మిగతా 25 షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
బీఎస్ఈ టాప్ గెయినర్స్: సన్ ఫార్మా, ఎటర్నల్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్
బీఎస్ఈ టాప్ లూజర్స్: భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, ఎన్‌టీపీసీ, టీసీఎస్,
గురువారం కూడా భారత స్టాక్ మార్కెట్ నష్టాలతోనే ముగిసింది. సెన్సెక్స్ 148.14 పాయింట్లు (0.18%) నష్టంతో 83,311.01 వద్ద, నిఫ్టీ 50 87.95 పాయింట్లు (0.34%) నష్టంతో 25,509.70 వద్ద ముగిశాయి. ఏషియన్ పెయింట్, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, మారుతి టాప్ గెయినర్స్ గా నిలిచాయి. పవర్‌గ్రిడ్, ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌టీపీసీ నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఆటో మినహా, నిఫ్టీ స్మాల్‌క్యాప్, నిఫ్టీ మిడ్‌క్యాప్, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ 100, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ సూచీలు నష్టాల్లో ముగిశాయి.