Tata Sierra : టాటా సియెర్రా ఫుల్ ట్యాంక్ ఖర్చు ఎంత ? ఎంత పెట్రోల్/డీజిల్ పడుతుందో తెలుసా ?

Update: 2025-12-02 08:00 GMT

Tata Sierra : అధునాతన డిజైన్, మెరుగైన ఫీచర్లతో కూడిన పవర్ఫుల్ ఎస్యూవీ అయిన టాటా సియెర్రా త్వరలో భారతీయ రోడ్లపై మళ్లీ సందడి చేయనుంది. ఈ కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి ఈ వాహనం గురించిన కొన్ని కీలక వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా టాటా సియెర్రాలో ఎన్ని లీటర్ల ఇంధన ట్యాంక్ ఇచ్చారు? ఒక ఫుల్ ట్యాంక్ నింపడానికి ఎంత ఖర్చు అవుతుంది? అనే వివరాలు తెలుసుకుందాం.

కంపెనీ అధికారిక సైట్ ప్రకారం.. టాటా సియెర్రా SUV లో వినియోగదారులకు 50 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయల్ ట్యాంక్ లభిస్తుంది. ఈ 50 లీటర్ల ట్యాంక్‌ను ఫుల్ చేయించడానికి ఎంత ఖర్చు అవుతుందనేది ఆయా నగరాలలో ఇంధనం ధరలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. హైదరాబాదులో ప్రస్తుతం ఉన్న ఇంధన ధరలను ఆధారం చేసుకుని ఫుల్ ట్యాంక్ ఖర్చును అంచనా వేయవచ్చు.

టాటా సియెర్రా పెట్రోల్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే, ఫుల్ ట్యాంక్ నింపడానికి అయ్యే ఖర్చు ఇలా ఉంటుంది. హైదరాబాదులో పెట్రోల్ ప్రస్తుత ధర: రూ.107.46(లీటర్‌కు) 50 లీటర్ల ఫుల్ ట్యాంక్కు అయ్యే ఖర్చు: రూ.5373 (రూ.107.46 x 50)

ఒకవేళ మీరు టాటా సియెర్రా డీజిల్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే, ఇందులో కూడా 50 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. హైదరాబాదులో డీజిల్ ధరల ప్రకారం అంచనా ఖర్చు.. ఢిల్లీలో డీజిల్ ప్రస్తుత ధర: రూ.95.70 (లీటర్‌కు). 50 లీటర్ల ఫుల్ ట్యాంక్ ఖర్చు: రూ.4,785 (రూ. 95.70 x 50)

గమనిక: ఇక్కడ లెక్కించిన ఖర్చులు కేవలం అంచనా మాత్రమే. ఇంధన ధరలు నిరంతరం మారుతూ ఉంటాయి కాబట్టి, ఆయా నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలలో వచ్చే మార్పుల కారణంగా 50 లీటర్ల ట్యాంక్‌ను ఫుల్ చేయించడానికి అయ్యే ఖర్చు కూడా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.

Tags:    

Similar News