మళ్లీ ట్వీట్‌తో సంచలనంగా మారిన ఎలోన్ మస్క్
టెస్లా ఇంక్ చీఫ్ ఎలోన్ మస్క్ టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను ఇప్పుడు బిట్‌కాయిన్ ఉపయోగించి కొనుగోలు చేయవచ్చంటున్నారు.;
కారు కొనాలంటే డబ్బులు కావాలి.. లేదా ఫైనాన్స్ తీసుకోవాలి. కానీ తన కార్లు కొనాలంటే బిట్ కాయన్ కూడా ఇవ్వండి అంటున్నారు ఈలాన్ మాస్క్. టెస్లా ఎలక్ట్రిక్-కార్ల తయారీ సంస్థ గత నెలలో 1.5 బిలియన్ డాలర్ల బిట్‌కాయిన్‌పై పెట్టుబడి పెట్టింది. దీంతో క్రిప్టో కరెన్సీ ధర ఎక్కడికో పోయింది.
తాజాగా టెస్లా ఇంక్ చీఫ్ ఎలోన్ మస్క్ టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను ఇప్పుడు బిట్‌కాయిన్ ఉపయోగించి కొనుగోలు చేయవచ్చంటున్నారు. ఈ ఏడాది చివర్లో అమెరికా వెలుపల ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని ట్వీట్ చేశారు. మీరు ఇప్పుడు బిట్‌కాయిన్‌తో టెస్లా కొనుగోలు చేయవచ్చు అని బుధవారం బుధవారం ట్వీట్ చేశాడు. ప్రపంచంలో బిట్‌కాయిన్‌ను అనుమతించిన మొదటి కార్ల తయారీ సంస్థ టెస్లానే కావడం విశేషం.
ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన క్రిప్టోకరెన్సీ ధర రోజు రోజుకి పెరుగుతోంది. తన ట్విట్టర్ ఖాతా ద్వారా క్రిప్టోకరెన్సీలను ప్రోత్సహిస్తున్న మస్క్ సాధారణ కరెన్సీపై విమర్శలు చేశారు. మొదట్లో పరిమిత స్థాయిలో చట్టాల అనుగుణంగా బిట్‌కాయిన్‌ను అనుమతించి తమ ఉత్పత్తులను అమ్ముతామని టెస్లా స్పష్టం చేసింది.