గుడ్ న్యూస్..దిగొచ్చిన బంగారం ధర.. పడిపోయిన వెండి.. ఈరోజు రేట్లు ఇలా!

Gold and Silver Rates Today: వివిధ నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Update: 2021-08-04 01:12 GMT

Gold and Silver Rates Today: బంగారం ధరలు స్పల్పంగా పడిపోయాయి. నిన్నటి ప్రారంభ ధరతో పోలిస్తే ఈ రోజు(04-08-2021 బుధవారం) బంగారం ధరలు పెరుగుదల నమోదు చేసుకోలేదు. నిన్న(03-08-2021) రూ.44,990గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ 44,900గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,090గా ఉండగా, ఈ రోజు రూ 48,980గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,330ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,450గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,960 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,960ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,000ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,980ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,980ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ 48,980 ఉంది.

వెండి ధరల విషయానికి వస్తే.. వెండిధరలు కూడా దిగొచ్చాయి. నిన్న ప్రారంభ ధరతో పోలిస్తే కాస్త పెరిగింది. నిన్న(03-08-2021 మంగళవారం) ప్రారంభ ధరలతో పోలిస్తే కేజీ వెండి రూ. 400 తగ్గింది. ఈ రోజు(04-08-2021 బుధవారం) వెండి 10 గ్రాములు రూ.727గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 72,700గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (04-08-2021 బుధవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News