Top 5 Cars Under Rs.10 Lakhs : రూ.10 లక్షల లోపు టాప్ 5 కార్లు..బడ్జెట్‌లో ది బెస్ట్ ఫీచర్లు, మైలేజ్.
Top 5 Cars Under Rs.10 Lakhs : దేశంలో జీఎస్టీ తగ్గించిన తర్వాత కొత్త కార్ల ధరలు కాస్త తగ్గాయి. దీనితో కొత్త కారు కొనాలనుకునే వారిలో ఉత్సాహం పెరిగింది. ముఖ్యంగా రూ.10 లక్షల లోపు బడ్జెట్‌లో మంచి ఫీచర్లు, అద్భుతమైన మైలేజ్ ఉన్న కారు కోసం చూస్తున్నారా? అయితే ఈ వార్తలో అలాంటి కార్ల గురించి తెలుసుకుందాం.
1. హ్యుందాయ్ వెన్యూ
హ్యుందాయ్ కంపెనీ నుంచి వచ్చిన ఈ కొత్త వెన్యూ కారు అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది. ఈ కారు లీటరుకు 17.9 కిలోమీటర్ల నుంచి 20.99 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది. ఇందులో 12.3 ఇంచుల కర్వ్డ్ పనోరమిక్ డిస్‌ప్లేలు (రెండు), వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఎలక్ట్రిక్ డ్రైవర్ సీట్, బోస్ 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఏసీ వెంట్లు వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.
2. మారుతి సుజుకి వాగన్ R
మారుతి సుజుకి ఈ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.4,98,900 నుంచి మొదలవుతుంది. ఈ కారు 25.19 కిలోమీటర్ల నుంచి 34.05 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది (మోడల్‌ను బట్టి). ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ (EBD), ఈఎస్‌పీ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్ సహా 12కు పైగా భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
3. కియా సోనెట్
ఎస్యూవీ స్టైల్ కోరుకునే వారికి కియా సోనెట్ మంచి ఛాయిస్. దీని ధర రూ.10 లక్షల లోపు నుంచే ప్రారంభమవుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7,30,138 నుంచి మొదలవుతుంది. ఇది 18.4 కిలోమీటర్ల నుంచి 24.1 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో లెవెల్ 1 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్, 70కు పైగా స్మార్ట్ కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి.
4. టాటా టియాగో
టాటా మోటార్స్ నుంచి వచ్చిన ఈ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ భద్రతకు చాలా ప్రసిద్ధి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.4.99 లక్షల నుంచి మొదలవుతుంది. పెట్రోల్‌పై 19 కిలోమీటర్లు, సీఎన్‌జీపై 26.49 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఫ్రంట్ డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, రివర్స్ కెమెరా వంటి మంచి ఫీచర్లు ఉన్నాయి.
5. హ్యుందాయ్ ఎక్స్‌టర్
హ్యుందాయ్ నుంచి వచ్చిన ఈ సరసమైన చిన్న ఎస్‌యూవీ అమ్మకాల్లో దూసుకుపోతోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.5,68,033 నుంచి మొదలవుతుంది. ఈ కారు 19.4 కిలోమీటర్ల నుంచి 27.1 కిలోమీటర్ల వరకు మంచి మైలేజ్ ఇస్తుంది. ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 8 ఇంచ్ హెచ్‌డీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 26 సేఫ్టీ ఫీచర్లు, 40కి పైగా అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ కార్లు తమ బడ్జెట్‌కు తగ్గట్టుగా అద్భుతమైన ఫీచర్లు, మెరుగైన మైలేజ్‌ను అందిస్తున్నాయి.