TVS Scooty : టీవీఎస్ నుంచి సరికొత్త స్కూటర్

Update: 2024-08-09 11:45 GMT

టీవీఎస్ కంపెనీ తన 125 సీసీ రేస్ ఎక్సీపీ సిరీస్ ఎస్కార్ట్ స్కూటర్ ను సరికొత్తగా ఆవిష్కరించింది. ఈ స్కూటర్ ను ప్రధానంగా యూత్ కోసం కంపెనీ డిజైన్ చేసింది. తాజాగా పలు కలర్స్ లోనూ అందుబాటులోకి తీసుకు వచ్చింది. టర్కోయిస్, హార్లిక్విన్ బ్లూ, నార్డో గ్రే కలర్స్ తో పాటు అదనంగా మ్యాట్ బ్లాక్ స్పెషల్ ను విడుదల చేసింది.

కొత్త కలర్స్ కస్టమర్లను మరింతగా ఆకర్షిస్తాయని కంపెనీ తెలిపింది. కొత్త ఎస్టార్క్ డిజైన్, కలర్స్ యూత్ ను మరింతగా ఆకర్షిస్తాయని కంపెనీ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిరుద్ధ వాల్దార్ చెప్పారు.

ఎస్టార్క్ 125, ఎస్టార్క్ రేస్ ఎక్స్ పీ లో ఈ రెండు వేరియంట్స్ ఉన్నాయి. కొత్త కలర్స్ అందుబాటులోకి తెచ్చింది. స్టార్క్ 125 ధర 86,871 రూపాయలు, ఎస్టార్క్ రేస్ ఎక్స్ పీ ధర 97,501 రూపాయలుగా నిర్ణయించారు.

Tags:    

Similar News