Aadi Pinisetty : ఆయనో పవర్ హౌస్ : బాలయ్యపై ఆది పినిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మన బాలయ్య బాబు ఎనర్జీ లెవెల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా అయిన రాజకీయాలు అయినా ఆయన ఎనర్జీ లో మార్పు ఉండదు. బాలకృష్ణ అంటే ఒక వ్యక్తి కాదని...ఆయనొక శక్తి అని అభివర్ణించారు యువనటుడు ఆది పినిశెట్టి. దర్శకుడు బోయపాటి శ్రీను, బాలయ్య బాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు ఆది.
"ఆయనొక పవర్‌హౌస్. తెరపై ఎలా కనిపిస్తారో, నిజ జీవితంలోనూ ఆయనది అదే వ్యక్తిత్వం. ఆయన దృఢ సంకల్పం, కష్టపడి పనిచేసే తత్వం ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయి. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను" అని ఆది పినిశెట్టి అన్నారు. దర్శకుడు బోయపాటి లో మ్యాజిక్ ఉందని...బాలయ్య బాబు, బోయపాటి కలయికలో వస్తున్న సినిమాలో అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని ఆది పేర్కొన్నారు. ఇక విలన్ పాత్రల గురించి మాట్లాడిన ఆయన...విలన్ పాత్రల్లో నటనకు స్కోప్ ఎక్కువ ఉంటుందని...అందుకే వాటిని ఎంచుకుంటున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్25 న సినిమా ను రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. ప్రస్తుతం అఖండ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా నడుస్తున్నాయి. ఇటీవలే బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు. బాలయ్య బాబు సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.