రజనీకాంత్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం కూలీ. సన్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మిస్తుండగా.. రజనీతో పాటు సౌబిణ్ షాహిర్, నాగార్జున, శ్రుతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టులో ఈ చిత్రం అత్యంత భారీగా విడుదల కానుంది. ఇక బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ ఇందులో అతిధి పాత్రలో అలరించనున్నాడు. దహా అనే ఒక మాస్ బాయ్ పాత్రలో అతడు కనిపించనున్నాడు. తాజాగా మూవీ టీమ్ అతడి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. నల్ల బనియన్ తొడుక్కొని మెడలో పెండెంట్ చైస్, చేతికి గోల్డ్ వాచ్, టాటూలు, చెవికి పిన్ను, చెరిగిన జుట్టుతో... అమీర్ ఊరమాస్లో కనిపిస్తున్నాడు. నిజానికి చాలా ఫ్లాఫ్ సినిమాల్లో నటిస్తున్న అతడికి ఈ కొత్త లుక్ రీఫ్రెషింగ్ లా కనిపిస్తోంది. స్ట్రాంగ్ గా హుక్కా పీలుస్తూ.. రింగు రింగులుగా పొగలు వదులుతున్నాడు. ఒక్కమా టలో చెప్పాలంటే చూడగానే తమిళ హీరో సూర్య మాస్ పాత్రను గుర్తుకు తెస్తున్నాడు. రోలెక్స్ గజినీకి తాతలా కని పిస్తున్నాడు. అతడు స్క్రీన్ పై కొద్దిసేపే కనిపించినప్పటిప కీ అభిమానుల్ని ఓ రేంజ్లో అలరించనున్నాడని రిలీజైన్ ఫస్ట్ లుక్ ను బట్టి అర్థమవుతోంది. ఇందులో నటించాల్సిం దిగా మూవీ టీమ్ ఆమీర్ ను సంప్రదించగా, కథేమిటి? పాత్ర ఏమిటని అడక్కుండానే సూపర్ స్టార్ పై ఉన్న అభిమానంతో ఓకే చెప్పాడట. దీంతో అతడి అభిమానానికి తగ్గట్టుగానే పాత్రను తయారు చేశారు.