నటి కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి వ్యక్తి గత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. ఈ జంట 2021 డిసెంబర్ 9న రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వాడాలో పెళ్లి పీటలెక్కింది. అప్పటి నుంచే కత్రినా గర్భవతి అనే ఊహాగానా లు వినిపించినప్పటికీ పలు సందర్భాల్లో వాటిని ఆ జంట ఖండించింది. ఒక సందర్భంలో విక్కీ కౌశల్ స్పందిస్తూ.. ఏదైనా ఉంటే తామే అధికా రికంగా చెబుతాం అని క్లారిటీ ఇచ్చారు. అయి నప్పటికీ ఆ రూమర్లు మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇటీవల కొన్ని ఈవెంట్లను హాజరు కావడం లేదు కత్రినా. అంతే కాదు. ఆమె బయట కనిపించినప్పుడు లూస్ దుస్తులు ధరించడం నెటిజన్లు గమనించారు. ఇంకేముంది? ఆమె తల్లి కాబోతున్నారేమో అనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ సారి ఈ జంట దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల్లోనూ చక్కర్లు కొడుతున్న ఈ వార్తపై నటి ఎలా స్పందిస్తుందో? ఎప్పుడు అధికారికంగా చెబుతుందో చూడాలి. తెలుగులో మల్లేశ్వరి మూవీతో సందడి చేసిన కత్రినా ఈ మధ్య సినిమాలు తగ్గించింది.