Navya Nair : మల్లెపూలు తీసుకెళ్లినందుకు.. నటికి రూ.1.14లక్షల జరిమానా

Update: 2025-09-09 08:00 GMT

మలయాళ నటి నవ్య నాయర్ ఆస్ట్రేలియాలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెకు మల్లెపూలు తీసుకువెళ్ళినందుకు గాను భారీ జరిమానా విధించబడింది. ఆస్ట్రేలియాలోని ఓనం వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన నవ్య నాయర్, తన వెంట 15 సెంటీమీటర్ల మల్లెపూల దండను తీసుకువెళ్లారు. అయితే, ఆస్ట్రేలియా కఠినమైన బయోసెక్యూరిటీ నిబంధనల ప్రకారం, పండ్లు, పూలు, మొక్కలు వంటి వాటిని అనుమతి లేకుండా దేశంలోకి తీసుకురావడం నేరం. ఈ నిబంధనను ఉల్లంఘించినందుకు ఆమెకు AUD 1,980 (సుమారు రూ. 1.14 లక్షలు) జరిమానా విధించారు. ఈ సంఘటన గురించి ఆమె స్వయంగా ఓనం వేడుకల్లో మాట్లాడుతూ వెల్లడించారు. తాను తెలియక ఈ తప్పు చేశానని, అయినప్పటికీ నిబంధనల ప్రకారం ఇది తప్పేనని అంగీకరించారు. ఈ ఘటన తర్వాత ఆమె తన సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో మల్లెపూల దండ ధరించి, "జరిమానా కట్టే ముందు కొంచెం షో-ఆఫ్" అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

Tags:    

Similar News