Allu Arjun Birthday : అల్లు అర్జున్ బర్త్ డే.. ఇంట్లో సెలబ్రేషన్స్

Update: 2025-04-08 16:00 GMT

తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని.. తరమే వాళ్లను హితులుగ తలచి ముందు కెళ్లాలని.. అన్నారో సినీ కవి.. బన్నీ విషయంలో అదే జరిగింది. 'గంగోత్రి' చిత్రంతో కథానాయకుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన బన్నీ, మెగాస్టార్ చిరంజీవి మే నల్లుడిగా ప్రేక్షకుల ముందు వచ్చాడు. మొదటి సినిమా వి జయవంతమైనప్పటికీ, 'ఇతనితో హీరోగానే ఎందుకు?'' అంటూ చాలా మంది విమర్శలు చేశారు. అతడిలో హీరోకు అవసరమైన లక్షణాలు లేవంటూ విమర్శించారు. ఆ విమర్శలను స్వీకరించి, తనలోని లోపాలను గుర్తించి మెరుగుపర్చుకోవడంపై బన్నీ దృష్టి పెట్టాడు. వరుసగా సినిమాలు చేస్తూ పుష్పతో తన సత్తా చాటాడు. ఇప్పుడు అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా రెండు వేల కోట్ల విలువైన బ్రాండ్గా మారాడు. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే ఇవాళ. 43వ పుట్టిన రోజు జరుపుకొంటున్న బన్నీకి అభిమానులు, నటీ నటులు, ఇతర ప్రముఖుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంట్లో సెలబ్రేషన్స్

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటో పంచుకున్నారు. కుటుంబంతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఆ ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ కు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ పుట్టినరో జు శుభాకాంక్షలు తెలిపారు. 'తనను తాను నిరూ పించుకోవడం కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి. మా రవీంద్ర నారాయణ్, విరాజ్ ఆనంద్, బంటుకు పు ట్టినరోజు శుభాకాంక్షలు' అని పోస్ట్ పెట్టారు. అలాగే ఈరోజు రానున్న బన్నీ సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తి గా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో రానున్న సినిమాకు సంబంధించిన అప్డేడేట్ కూడా ఈరోజే రానుందని అభిమానులు భావిస్తున్నారు.

Tags:    

Similar News