స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఘాటీ మూవీని పలు వాయిదాల తర్వాత సెప్టెంబర్ 6న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెలలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా మరోసారి పోస్ట్ పోన్ కాక తప్పలేదు. ఆగస్టు చివరి నాటికి అన్ని పనులు పూర్తయితే సెప్టెంబర్ 6న రిలీజ్ చేయొచ్చని ఎక్కువ టైమ్ తీసుకున్నారు. వచ్చే నెల నుంచే ప్రమోషన్లు చేయాలని భావిస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ కు కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఇలా అన్ని వైపుల నుంచి ఒక పాజిటివ్ బజ్ తీసుకొస్తున్నారు. కానీ ఈ మూవీకి ది గర్ల్ ఫ్రెండ్ పోటీ వస్తున్నట్లు వార్తలు వినిపి స్తున్నాయి. ఘాటీ రిలీజ్ కు సరిగ్గా ఒక్కరోజు ముందే గర్ల్ ఫ్రెండ్ మూవీ విడుదల అన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారుతోంది. రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ది గర్ల్ ఫ్రెండ్పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు పీక్స్ కు చేరాయి. అంతే కాదు రష్మికకు పాన్ ఇండియా క్రేజ్ ఉంది. అన్ని భాషల్లో అమ్మడికి అభిమానులున్నారు. ఈ నే పథ్యంలో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయితే గనక ఘాటీకి గట్టి పోటీ తప్ప దనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఈ రెండు సినిమాల రిలీజ్ లకు సంబంధించి ప్రకటన అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.