Shefali Jariwala : బాలీవుడ్లో విషాదం .. గుండె పోటుతో షఫాలీ జరివాలా మృతి
బాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి, బిగ్ బాస్ -13 ఫేం షఫాలి జరివాలా కన్నుమూశారు. ముంబైలో గుండెపోటుతో షఫాలి చనిపోయారు. శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన షఫాలిని హుటాహుటిన అంథేరిలోని బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. మృతదేహం పోస్టుమార్టం కోసం కోపర్ ఆసుపత్రికి తరలించారు. షఫాలీ మరణ వార్తపై ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
2015లో షఫాలి జరివాలాకు యాక్టర్ పరాగ్ త్యాగీతో షఫాలీ పెళ్లి జరిగింది. 2002లో వచ్చిన 'కాంటా లగా' పాట రిమిక్స్ వర్షన్‌తో షఫాలి జరివాలా బాగా ఫేమస్ అయ్యారు. పలు సినిమాలు, టీవీ షోల్లో షఫాలి పాల్గొన్నారు. బిగ్ బాస్ 13 హిందీ వర్షన్లోనూ షఫాలీ పాల్గొన్నారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన ‘ముజ్సే షాదీ కరోగి’ చిత్రంలో ఆమె ఓ చిన్న పాత్రలో కనిపించారు.షఫాలి మృతిపై బాలీవుడ్ చిత్రపరిశ్రమ సంతాపం ప్రకటించింది ఆమె మృతిపై సింగర్ మికా సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. కాగా షఫాలీ జరివాలా 1982 డిసెంబర్ 15న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. ఆమె తండ్రి పేరు సతీష్ జరీవాలా, తల్లి పేరు సునీతా జరీవాలా.