Cinema Pichodu on OTT : ఓటీటీలో సినిమా పిచ్చోడు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Update: 2025-05-15 10:00 GMT

గత ఏడాది నవంబర్ లో రిలీజైన మూవీ సినిమా పిచ్చోడు. కుమారస్వామి హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. పెద్దగా ఆకట్టుకోని స్టోరీ, తక్కువ బడ్జెట్ తో తీసిన చిత్రం కావడంతో థియేటర్లలోకి వచ్చి వెళ్లిన సంగతి కూడా చాలామందికి తెలియదు. ఆరు నెలల తర్వాత ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రెంట్ విధానంలో అందు బాటులోకి వచ్చింది. జోష్ అలియాస్ కుమారస్వామి గ్రామంలో పాలు అమ్ముతుం టాడు. కానీ సినిమాలంటే పిచ్చి. అందుకే ఊరిలో వాళ్లని పేరుతో కాకుండా సినిమా పేర్లతో పిలుస్తుంటాడు. ఓసారి భాను.. డెమో ఫిల్మ్ తీసేందుకు జోష్ఉంటున్న ఊరికి వస్తుంది. ఈ క్రమంలో అనుకోకుండానే జోష్ కి నటించే అవకాశమొస్తుంది. తర్వాత ఏమైందనేదే స్టోరీ.

Tags:    

Similar News