Akanksha Singh : గ్లామర్ పాత్రలకు కండిషన్స్ అప్లయ్

Update: 2025-05-23 09:15 GMT

మళ్లీ రావా అనే మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ ఆకాంక్ష సింగ్. అందం.. అభినయం బాగా కలిసొచ్చాయి. తొలి సినిమా మంచి విజయం సాధించింది. అటుపై దేవదాస్ చిత్రంలో ఛాన్స్ అందుకుంది. క్లాప్, శివుడు అనే మరో రెండు సినిమాలు కూడా చేసింది. తెలుగులో మాత్రం అమ్మడికి రావాల్సినంత గుర్తింపు రాలేదు. తొలి సినిమా సక్సెస్ అనంతరం స్టార్ లీగ్ లో వేగంగానే చేరుతుందని భావించినా అలా జరగలేదు. మళ్లీ మూడేళ్లకు షష్టిపూర్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. ఇందులో డీసెంట్ పాత్రలో కనిపించ బోతుంది. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అమ్మడు గ్లామర్ పా త్రలకు దూరంగా ఉంటుంది. రొమాంటిక్ సన్నివే శాలంటే అంగీకరించదు. పెదవి ముద్దులు... ఇంటి మేట్ సీన్స్ అంటే నో ఛాన్స్ అంటుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చూజ్ చేసుకుం టుంది. ఈ అమ్మడి కండిషన్ల కారణంగానే ఆఫర్లు రావడం లేదనే టాక్ ఉంది. అందుకే తెలు గులోనే కాదు, హిందీ, తమిళంలోనూ ఆకాంక్ష చాలా అవకాశాలు కోల్పో యిందనే టాక్ ఉంది. షష్టిపూర్తి మూవీ విషయానికి వస్తే ఈ మూవీ మే 30న విడుదల కాబోతోంది. రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రలు పోషించగా, రూపేష్, ఆకాంక్ష సింగ్ జంటగా నటించారు. పవన్ ప్రభ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ ఈ మూవీని నిర్మించాడు.

Tags:    

Similar News