Kalki 2898 AD Trailer : రెండు రోజుల్లో కల్కి ట్రైలర్.. దుమ్ములేపుతున్న అప్ డేట్స్
ప్రభాస్ నటించిన ప్యాన్ వరల్డ్ మూవీ, ఇండియా హైఎస్ట్ బడ్జెట్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ మూవీ ట్రైలర్ ను జూన్ పదవ తేదీన విడుదల చేయబోతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ అవతార్లో ఉన్న కొత్త పోస్టర్ వైరల్ అవుతోంది. రోజుకో యాక్టర్ ఫొటోను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇవన్నీ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ ఇస్తున్నాయి.
'కల్కి 2898 ఏడీ'లో ఇండియన్ స్టార్స్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ ఫన్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. ఈ చిత్రం 2024 జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
అమితాబ్ యుద్ధభూమి మధ్యలో నిలబడి, అస్త్రాన్ని చేత పట్టుకుని, నుదిటిపై దివ్య రత్నాన్ని ధరించి, యుద్ధానికి సిద్ధంగా వున్నట్లుగా కనిపించారు. అతని వెనుక భారీ యంత్రాలతో పాటు కొంతమంది నేలపై పడివుండటం చూడొచ్చు. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్ర లుక్ ను మధ్యప్రదేశ్లోని నెమావార్, నర్మదా ఘాట్ వద్ద ఆవిష్కరించారు. వీటికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. అశ్వత్థామ ఇప్పటికీ నర్మదా తీరంలొ నడుస్తాడని నమ్ముతారు.