Shannu Deepu Breakup: బ్రేకప్‌కు కారణం బయటపెట్టిన దీప్తి.. లైవ్‌లో క్లారిటీ..
Shannu Deepu Breakup: య్యూటూబర్స్‌గా ఎంతోకాలంగా వెలిగిపోతున్న కపుల్ షణ్ముఖ్, దీప్తి సునయన.;
Shannu Deepu Breakup: య్యూటూబర్స్‌గా ఎంతోకాలంగా వెలిగిపోతున్న కపుల్ షణ్ముఖ్, దీప్తి సునయన. వీరిద్దరు దాదాపు కెరీర్‌ను ఒకేసారి ప్రారంభించారు. డబ్ స్మాష్‌లతో, షార్ట్ ఫిల్మ్స్‌తో, కవర్ సాంగ్స్‌తో సోషల్ మీడియాను ఆకట్టుకుని స్టార్స్ అయిపోయారు. కపుల్ టాటూతో వీరిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అలా ఆరు సంవత్సరాలుగా అందరినీ అలరించిన ఈ కపుల్‌కు ఇటీవల బ్రేకప్ జరిగింది.
బిగ్ బాస్ 5 వీరి బ్రేకప్‌కు కారణమని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం సాగుతోంది. బిగ్ బాస్ తెలుగు 5లో రన్నర్‌గా నిలిచిన షణ్మూ టాస్క్‌లలో, ప్రేక్షకులను అలరించడంలో పర్వాలేదనిపించుకున్నాడు కానీ సిరితో ఫ్రెండ్‌షిప్ మాత్రం తనకు అంతగా కలిసి రాలేదు. అందువల్లే తాను రన్నర్‌గా మిగిలిపోయాడని కూడా చాలామంది అనుకున్నారు. ఇప్పుడు షణ్మూతో దీప్తి బ్రేకప్‌కు కూడా ఇదే కారణమని భావిస్తున్నారు.
బ్రేకప్ అనౌన్స్‌మెంట్ చేసిన తర్వాత మొదటిసారి దీప్తి సునయన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ వీడియోలో తన ఫ్యాన్స్‌తో మాట్లాడింది. అందులో తన బ్రేకప్‌కు కారణాన్ని చెప్పింది దీప్తి. ఇన్నేళ్లు తన కెరీర్ గురించి పెద్దగా ఆలోచించలేదని, ఇప్పుడు పూర్తిగా తన కెరీర్‌పై మాత్రమే దృష్టిపెట్టాలనుకుంటున్నట్టు తెలిపింది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు లైవ్‌లో క్లారిటీ ఇచ్చింది దీప్తి.