ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మీనాక్షి చౌదరి. రవితేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈఅమ్మడు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతోంది. తెలుగులో లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఈ భామకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టగా, 'గోట్' చిత్రం తమిళంలో తనకు కమర్షియల్ విజయాన్ని కట్టబెట్టింది. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస చిత్రాలకు సంతకాలు చేస్తోంది. మీనాక్షి చౌదరి తాజాగా జేఎఫ్ డబ్ల్యూ కవర్ పేజీపై దర్శనమిచ్చింది. పేపర్ తో తయారుచేసిన డిజైనర్ఆకులు,పూలు.. వాటితోనే అందమైన డిజైనర్ డ్రెస్. దానికి కాంబినేషన్ హీల్స్, తలలో ఇమిడిన అందమైన క్రౌన్అలంకరణ.. ప్రతిదీ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎలిజబెత్ మాదిరి మీనాక్షి ఇచ్చిన ఫోజు కుర్రకారును కిల్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. మీనాక్షిని చూడగానే డిజైనర్ రాకుమారిని తలపిస్తోందని ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.