Aamir Khan : రూపాయి కూడా తీసుకోలేదు.. కూలీ సినిమా రెమ్యునరేషన్‌పై ఆమీర్ ఖాన్ క్లారిటీ
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలీ’ చిత్రం కలెక్షన్లతో రికార్డులు తిరగరాస్తుంది.ఈ సినిమాలో రజనీకాంత్ నాగర్జునతో పాటు అతిథి పాత్రలో కనిపించిన బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌ల రెమ్యునరేషన్‌పై గత కొన్ని రోజులుగా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమీర్ ఖాన్ తన అతిథి పాత్రకు ఏకంగా రూ.20 కోట్లు తీసుకున్నారని ప్రచారం జరిగింది. ఈ వార్తలపై చిత్ర బృందం ఖండించినప్పటికీ, పుకార్లు ఆగలేదు. తాజాగా, ఆమిర్ ఖాన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తన పారితోషికంపై స్పష్టత ఇచ్చారు.
ఈ సినిమా కోసం తాను రూపాయి కూడా తీసుకోలేదని అమీర్ వెల్లడించారు. ‘‘రజనీకాంత్‌పై నాకు ఉన్న ప్రేమ, అభిమానానికి వెలకట్టలేను. ఆయనతో కలిసి తెరపై కనిపించడమే నాకు పెద్ద రివార్డు. దీనికి మించిన విలువైనది ఏదీ ఉండదు’’ అని ఆమిర్ ఖాన్ తెలిపారు. ‘‘నేను అతిథి పాత్రలో మాత్రమే కనిపించాను. రజనీకాంత్, నాగార్జునలే ఈ సినిమాకు అసలైన హీరోలు. ప్రేక్షకుల్లో ఈ స్థాయిలో ఆసక్తి కనిపిస్తుందంటే అది వారిని చూసేందుకే, నా కోసం కాదు" అని ఆయన అన్నారు. ఆమీర్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఆయన రెమ్యునరేషన్‌పై జరుగుతున్న ప్రచారానికి తెరపడింది.